IND vs PAK: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ రెండు జట్ల మధ్య 16 నెలల తర్వాత జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే, ఈ చిరకాల ప్రత్యర్థులు ఢీకొనే హై-వోల్టేజ్ పోరును మరింత ఉత్తేజపరిచేలా ఐదు అంశాలు..
Read Also: SLBC Tunnel: క్షణక్షణం ఉత్కంఠ.. సన్నగిల్లుతున్న ఆశలు!
1. ఇద్దరు సూపర్ స్టార్ల యుద్ధం..
చాలా సంవత్సరాలుగా దాయాదా దేశాల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే, బ్యాటింగ్ విభాగంలో భారత పటిష్టంగా ఉంటే.. బౌలింగ్ లో పాకిస్తాన్ బలంగా ఉంది.. ఇక, 2021 నుంచి ఈ మ్యాచ్ ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ- బాబర్ ఆజం ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేటి మ్యాచ్ కు ముందు ఇద్దరు సూపర్ స్టార్లు ఫామ్‌లో లేరు.. కోహ్లీ తన గత ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగా.. బాబర్ ఆజమ్ సైతం తన పేలవమైన స్ట్రైక్ రేట్ కారణంగా విమర్శలకు గురవుతున్నాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు ఒత్తిడిని జయించి తన జట్టును విజయంలో కీలక పాత్ర పోషిస్తారనేది వేచి చూడాలి.
2. స్పిన్ తో తికమక..
టీమిండియా తన 15 మంది సభ్యుల జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయగా, పాకిస్తాన్ జట్టులో ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. దుబాయ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం మనం చూడొచ్చు. నేడు జరిగే మ్యాచ్‌లో కూడా స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ ఉంది. ఇక, ఈరోజు పాక్ తో జరిగే మ్యాచ్ లో తుది జట్టులో వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కొచ్చు. ఇక, టీమిండియాకు షాక్ ఇచ్చేందుకు పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్, నసీమ్ షాలతో కూడిన పేస్ దళాంతో దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది. దీంతో స్పిన్ vs పేస్ యుద్ధంలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి..
Read Also: Mahesh Babu: SSMB29 మూవీ పై రాజమౌళి ప్రెస్ మీట్..?
3. భారతదేశం ఆధిపత్యం
73 ఏళ్ల ఈ పోటీలో భారత్- పాకిస్థాన్ జట్లు వేర్వేరు దశల్లో ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించాయి. తొలి 24 సంవత్సరాలు (1978-2002 వన్డేల్లో) పాకిస్తాన్ 85 వన్డే మ్యాచ్‌లలో 52 గెలిచి, బలమైన జట్టుగా నిలిచింది.. అయితే, అనంతరం 2002 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత 23 ఏళ్లలో మెన్ ఇన్ బ్లూ జట్టు చిరకాల ప్రత్యర్థులకు ఎదురుదెబ్బ కొట్టడంలో విజయవంతమైంది. ఎందుకంటే టీమిండియా 2003 నుంచి 50 మ్యాచ్‌లలో 28 విజయాలతో పాక్ పై ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే, 2010 నుంచి ఈ పోరు ఏకపక్షంగా మారిపోయింది. భారతదేశం 17 మ్యాచ్‌లలో 12 సార్లు పాకిస్తాన్‌ను ఓడించింది. ఇక, నేడు జరగబోయే మ్యాచ్ లో మరోసారి టీమిండియా- పాకిస్థాన్ మధ్య పోరు ఉండబోతుంది అనేది చూడాలి.
4. పాకిస్తాన్‌ను ఎప్పుడూ లెక్క చేయకండి
క్రీడా చరిత్రలో అత్యంత చురుకైన జట్లలో ఒకటిగా పాకిస్తాన్ ఖ్యాతిని కలిగి ఉంది. ప్రత్యర్థి జట్లను ఆశ్చర్యపరిచేందుకు ఎన్ని అడ్డంకులను అయినా మెన్ ఇన్ గ్రీన్ టీమ్ అధిగమించగలదు. అలాగే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో వారు ఎదుర్కొన్న అదే క్లిష్ట పరిస్థితిలో.. లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ఫైనల్ లో మాత్రం మెన్ ఇన్ బ్లూను ఓడించి తమ తొలి టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈరోజు జరిగే డూ-ఆర్-డై మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ బృందం కూడా ఇలాంటిదే చేయాల్సి ఉంటుంది.
Read Also: Sridhar Babu: ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టాం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
5. దుబాయ్‌లో అనూహ్య పరిస్థితులు
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ రెండవ మ్యాచ్ భిన్నమైన పిచ్‌పై ఆడనుంది భారత్. ఇది రెండు జట్ల ఆసక్తిని పెంచుతుంది. మొదటి మ్యాచ్‌లో స్పిన్నర్లు దానిపై బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదించినట్లు కనిపించినప్పటికీ.. ఈరోజు ఆడే పిచ్ అలాగే ఉంటుందో లేదో చూడాలి.. అంతేకాకుండా, మంచు కురిస్తే.. బ్యాటర్లకు అనుకూలంగా మారుస్తుండటంతో.. రెండవ ఇన్నింగ్స్‌లో దుబాయ్ బౌలర్లకు కష్టంగా మారనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌కు మంచు కురవకపోయినప్పటికీ.. ఈ మ్యాచ్ లో కూడా మంచు కురవదని పూర్తి నమ్మకంతో చెప్పలేము అని క్యూరేటర్లు తెలిపారు. ఇక, టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్లు తీసుకునే నిర్ణయంపై ఆలోచించాల్సి ఉంటుంది.