T20 World Cup 2026: పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్‌లు ఓడితే ఇంటికే!
- భారత్‌తో లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించిన పాక్
- టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్
- రెండు మ్యాచ్‌లు ఓడితే టోర్నీ ముగిసినట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి ప్రస్తుతం ఆ దేశ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల పాక్ ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. అంతేకాదు కీలకమైన రెండు పాయింట్లు కూడా టీమిండియా ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌కు ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం.. ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడితే సూపర్ 8 అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే.
ఇప్పటికే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడినట్లే లెక్క. మరో రెండు మ్యాచ్‌లు కోల్పోతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై ప్రతి మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డైగా మారింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. పాక్ మిగిలిన మ్యాచ్‌లలో ఢీకొట్టాల్సింది అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలను. ఈ జట్లను తేలికగా తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నీల్లో ఈ టీమ్స్ పెద్ద జట్లకు షాకులు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలు పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇవ్వగలవు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: T20 World Cup 2026: బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!
బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్‌లో కీలక సమయాల్లో పరుగులు ఇవ్వడం వంటి సమస్యలు పాకిస్థాన్‌ను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. టీమ్ కాంబినేషన్‌పై కూడా స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ పాక్ 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోతే మెగా టోర్నీలో ముందుకు సాగడం కష్టమే. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ప్రయాణం ప్రస్తుతం నల్లేరుపై నడకే అనే చెప్పాలి. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ పాక్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. జట్టు ప్రదర్శనలో భారీ మార్పులు వస్తే తప్ప.. పాకిస్థాన్ సూపర్ 8 వెళ్ళలేదు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..