T20 World Cup 2026 Schedule: మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8, 2026 వరకు జరగనుంది. నేడు ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ ఈ కీలక వివరాలను ప్రకటిస్తూ, టోర్నమెంట్‌కి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారతదేశంలో అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే శ్రీలంకలోని మూడు వేదికలు కూడా ఈ మెగా టోర్నీకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.
Local Body Elections : ఎన్నికల అలర్ట్..! కీలక తేదీలు ఇవే..!
భారత్ సూపర్ 8 దశకు చేరితే.. ఆ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా వేదికల్లో నిర్వహించబడతాయి. అలాగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే టీమిండియా తన కీలక మ్యాచ్‌ను ముంబై వేదికలో ఆడనుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా జట్లను విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, USA, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమాన్ ఉండగా.. గ్రూప్ Cలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీలు.. ఇంకా గ్రూప్ Dలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్, కెనడా, UAE జట్లు ఉన్నాయి.
Visakhapatnam: విశాఖపట్టణం గూఢచర్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు.. NIA ప్రత్యేక కోర్టు తీర్పు
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబై వేదికలో USAతో ఆడనుంది. ఫిబ్రవరి 12న న్యూఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడుతుంది. భారత్–పాక్ హై వోల్టేజ్ మ్యాచ్, రోహిత్ శర్మ కొత్త పాత్ర, భారత్‌లో జరగనున్న కీలక మ్యాచ్‌లు.. ఇవన్నీ కలిపి ఈసారి టీ20 ప్రపంచకప్‌పై మరింత ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.