USCIRF: భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది.
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు.
America : దేశంలో అక్రమంగా నివసిస్తున్న 119 మంది భారతీయులను తీసుకుని అమెరికా సైనిక విమానం ఈ రాత్రి అమృత్సర్ చేరుకుంటుంది. శుక్రవారం ఈ సమాచారం వర్గాలు తెలిపాయి.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం మూడు వారాల్లోనే తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే అమెరికా విదేశాంగ విధానానికి కొత్త మలుపు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దౌత్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చూపించారు.
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.
Shabbir Ali : ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక.. మన దేశానికి లాభం అని అనుకున్నారని, 104 మందిని నిన్న దేశానికి పంపించారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జనవరి నుండి… అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని పంపిస్తాం అంటూనే ఉన్నారని, కానీ కేంద్రం అసలు.. దీనిపై మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెరికా నుండి చేతులు..కాళ్ళు కట్టేసి తెచ్చారని, వాళ్ళను కనీసం ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోలేదని ఆయన మండిపడ్డారు. KTR : బుల్డోజర్లు పంపడంలో ఉన్న…
S Jaishankar: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ని ‘‘అమెరికన్ జాతీయవాది’’గా జైశంకర్ అభివర్ణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు.
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,
Trump's Inauguration: జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు, కీలక నాయకులకు, టెక్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వారందరికి ఆహ్వానాలు వెళ్లాయి. యూఎస్ క్యాపిటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు హాజరుకాబోతున్నారు.