India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి. READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత…
Sergio Gor: భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇద్దరు రక్షణ, వాణిజ్యం, సాంకేతికతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఉన్న సంతకం చేసిన ఫోటోను ఆయన ప్రధానికి బహూకరించారు. మోడీకి బహూకరించిన ఫోటోలపై ట్రంప్ ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు’’ అని రాశారు.
Pak PM: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు.
Modi Trump Meeting: అగ్రరాజ్యాధినేతగా, తన దూకుడైన నిర్ణయాలతో సంచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కళ్లెం వేస్తారా. ప్రపంచమంతా ఈ ఇరువురి సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇంతకీ మోడీ – ట్రంప్ మీటింగ్ ఎక్కడ ఉండనుందో తెలుసా.. ఒక వేళ వాళ్లు కలిస్తే ఏయే అంశాలపై ప్రధానంగా చర్చ జరగవచ్చు అనేది ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతుంది. అగ్రరాజ్యాధినేత, భారత ప్రధాని మీటింగ్ స్పాట్‌గా…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ అంశంపై ప్రసంగిస్తారు అనే సమాచారం లేదు. అయితే.. రేపుటి నుంచి జీఎస్టీ 2.0 అమలు కానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ సమాచారం అందించవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా.. అనేక ఉత్పత్తులపై రేట్లు తగ్గనున్నాయి. గతంలో జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండటా.. ప్రస్తుతం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇందులో 12%,…
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడంతో, రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు, భారత్, రష్యాకు మరింత దగ్గర అవ్వడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపడటం, అమెరికన్ రాజకీయవేత్తల్ని కలవరపరుస్తోంది.
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
ప్రధాని మోడీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ నిర్ణయం.. అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.