Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడంతో, రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు, భారత్, రష్యాకు మరింత దగ్గర అవ్వడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపడటం, అమెరికన్ రాజకీయవేత్తల్ని కలవరపరుస్తోంది.
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
ప్రధాని మోడీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ నిర్ణయం.. అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.
రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనలపై విలేకరులు ట్రంప్‌ను క్వశ్చన్ చేశారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ఈ విషయం గురించి నాకు తెలియదు.. తెలుసుకుని.. త్వరలోనే మీకు సమాధానమిస్తానని చెప్పారు.
Nikki haley: అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ మరోసారి భారత పక్షాన గళం విప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించబోయే టారిఫ్ బెదిరింపులపై ఆమె స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. భారత్ వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలి. చైనా వంటి శత్రువుకు మినహాయింపులు ఇవ్వొద్దు అని ట్వీట్ చేశారు. Donald Trump: 5 నెలల్లో 5 యుద్ధాలు ఆపాను! భారత్-పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌పై మరోసారి…
F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.
డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసిన హర్ష్ గొయెంకా, భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్‌లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు.