అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
READ MORE: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్..!
నిజానికి, స్టీఫెన్ అనే వ్యక్తి వాషింగ్టన్ స్టేట్ సియాటిల్ నగరంలోని మ్యాన్‌హోల్ కవర్ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. దానికిపై “మేడ్ ఇన్ ఇండియా” అని రాసి ఉంది. ఈ పోస్ట్‌ను పంచుకున్న స్టీఫెన్ ప్రశ్నను లేవనెత్తాడు. “సియాటిల్ నగరానికి మ్యాన్‌హోల్ మూతలు భారతదేశం నుంచి ఎందుకు వస్తున్నాయి.?” అని స్టీఫెన్ అడిగిన ఈ ప్రశ్న వైరల్ గా మారింది. ఇరు దేశాల నెటిజన్లు ఈ అంశంపై చర్చించారు.
READ MORE: Rain Alert In TG: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే నాలుగు రోజుల పాటు వానలే వానలు..
చాలా మంది అమెరికన్స్ దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికా దేశీయ తయారీని ప్రోత్సహిస్తున్నప్పుడు.. విదేశాల నుంచి ఇలాంటి ప్రాథమిక వస్తువులను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. “అమెరికా నగరాలకు సరిపడ మ్యాన్‌హోల్ కవర్లను కూడా తయారు చేయలేదా?” అని ఒక అమెరికన్ వినియోగదారు వ్యాఖ్యానించారు. కొంతమంది నెటిజన్లు ఈ మ్యాన్‌హోల్ కవర్‌ను భారతదేశ పారిశ్రామిక సామర్థ్యానికి ఉదాహరణగా అభివర్ణించారు. భారత్‌ను ప్రశంసించారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత్ నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటాయని.. ఇది గర్వకారణమని వ్యాఖ్యానించారు.
READ MORE: Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
వినీత్ నాయక్ అనే భారతీయ వినియోగదారుడు స్టీఫెన్‌కు ప్రత్యుత్తరం ఇచ్చాడు. భారత్ అమెరికా కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. కాబట్టి భారత్ నుంచి దిగుమతులు అంతిమంగా అమెరికన్లకే ప్రయోజనమని అన్నారు. ఇలాంటి విషయాలు ఇతర దేశాలకు బదిలీ చేసి అమెరికన్ సంస్థలు అత్యాధునిక యంత్రాలు, ఆయుధాల అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం చిక్కిందని అభిప్రాయపడ్డారు. కొందరు పర్యావరణ కారణాలు కూడా దీనికి ఓ కారణమని చెప్పుకొచ్చారు.
READ MORE: Aadhaar: ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
Why does the city of Seattle get their manhole covers from India? pic.twitter.com/E75TEP7ZNj
— Stephen “The Yellow Dart” Schutt (@schuttsm) May 23, 2025