F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది. కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖండే లేవనెత్తిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తి వర్థన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ ఈ అంశంపై ఇంకా అధికారిక చర్చలు జరగలేదు’’ అని వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: మీ కుటుంబం చరిత్ర మాకు తెలియదా?.. హోం మంత్రిపై అంబటి రాంబాబు ఫైర్
ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత F-35 విమానాల అమ్మకం కోసం అమెరికా భారతదేశానికి ఏదైనా అధికారిక ప్రతిపాదనను పొడిగిందా అని అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించిన నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించింది. భారత్ ఎగుమతులపై 25 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి.