High Alert In Taj Mahal: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ జారీ చేసింది. కీలకమైన ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచింది. ఇందులో భాగంగానే, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాతో పాటు సైనిక ప్రాంతాల చుట్టూ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ భద్రతపై కమిషనరేట్‌లోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి, మాక్ డ్రిల్స్, ఫుట్ పెట్రోలింగ్ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: #Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!
అయితే, ఆగ్రాలో ఎయిర్ పోర్ట్ ప్రాంతం నుంచి తాజ్ మహల్ వరకు ప్రత్యేక నిఘా పెంచాలని పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ సూచించారు. అలాగే, డ్రోన్‌లను ఎగర వేయడం పూర్తిగా నిషేధించారు. ప్రతి రోజూ హోటల్స్, హోటళ్లలో బస చేసే విదేశీయుల గురించి యాజమాన్యం వెంటనే సమాచారాన్ని పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, తాజ్ మహల్ భద్రతకు సంబంధించి కూడా సూచనలు చేసినట్లు సిటీ డీసీపీ సోనమ్ కుమార్ వెల్లడించారు. మాక్ డ్రిల్‌తో పాటు, ఫుట్ మార్చ్ కొనసాగుతుందన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించాం.. పోలీసులకు సెలవులను కూడా రద్దు చేశారు. ఇంటలిజెన్స్ సూచనలతోనే భద్రతను మరింత పటిష్టం చేసిన పేర్కొన్నారు.