India-Pakistan War: వెనక్కి తగ్గిన పాకిస్తాన్..! భారత్ ముందు కీలక ప్రతిపాదన..
- భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్..!..
- విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన..
- భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటన..
- పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతారణం నెలకొంది.. దాడులు, ప్రతిదాడులు.. దాడులను తిప్పికొట్టడం ఇలా దేశాల సరిహద్దుల్లో యుద్ధమే నడుస్తోంది.. పహల్గామ్ దాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు దిగగా.. భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలు ఆర్మీ బేస్‌లతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు..
Read Also: Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశామని వెల్లడించారు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఇషాక్ దార్.. కాగా, ఈ రోజు పాక్ ఆర్మీ చీఫ్ కు ఆమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఫోన్ చేసిన విషయం విదితమే.. కాల్పులు విరమించాలని పాక్‌ను కోరారు ఆమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో.. మరోవైపు.. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్ చేసి… ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని రుబియో సూచించిన విషయం విదితమే..
Read Also: No Firecrackers : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడం నిషేధం..
కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో పాక్ ఉంది.. భారత బలగాలను రెచ్చగొడుతూనే ఉంది.. సరిహద్దుల వెంట ముందుకు చొచ్చుకొచ్చాయి పాక్ బలగాలు.. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం అయ్యింది.. ఇక, జైసల్మేర్ టార్గెట్‌గా పాక్ దాడులకు పూనుకుంది.. జైసల్మేర్ వ్యాప్తంగా ఉదయం నుంచే ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు, ఆర్మీ.. జైసల్మేర్ కు 6 కి.మీ పరిధిలో ఉన్న గిడా గ్రామంలో మిస్సైల్స్ ను భారత ఆర్మీ కూల్చివేసింది.. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.. జైసల్మేర్ ప్రధాన రహదారులను ఖాళీ చేయించాయి భద్రతాదళాలు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని స్పష్టం చేసింది.. రెండు రోజుల పాటు రాత్రి సమయంలోనే దాడులకు పాల్పడిన పాక్.. ఈ రోజు తన పంతాను మార్చి.. ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తోంది.. ఇప్పుడు పాక్ విదేశాంగ మంత్రి ప్రతిపాదనతో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తున్నా.. బోర్డర్ నుంచి వెనక్కి తగ్గుతుందా? ఇంకా ఉధృతం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది..
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!