Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మర్చిపోయిన ఒక బంగారం కలిగిన బ్యాగును టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి బాధితుడికి సురక్షితంగా అప్పగించారు. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద సోమవారం ఉదయం సుమారు 11:35 గంటలకు భద్రతా తనిఖీలు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు మహేష్ అక్కడి భద్రతా తనిఖీల సమయంలో అనుకోకుండా తన వద్ద ఉన్న ఒక బ్యాగును చెక్‌పాయింట్ వద్దే మర్చిపోయి ముందుకెళ్లాడు.
అక్కడే విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యజమాని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దానిని తెరిచి పరిశీలించగా అందులో సుమారు 100 గ్రాముల బరువు కలిగిన విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అలిపిరి ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం ప్రారంభించారు. సీసీ పుటేజీ ఆధారంగా బ్యాగును మర్చిపోయిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన భక్తుడిగా గుర్తించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అప్పటివరకు తాను బంగారం ఉన్న బ్యాగును మర్చిపోయిన విషయాన్ని కూడా సదరు భక్తుడు గుర్తించకపోవడం గమనార్హం. అధికారులు సీసీటీవీ ద్వారా భక్తుడి ఆచూకీ కనిపెట్టి, ఆయనను వెంటనే విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించారు. ఆ 100 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును భద్రంగా ఆయనకు అందజేశారు. తన విలువైన బంగారాన్ని ఏమాత్రం పొరపాటు లేకుండా తిరిగి అందించినందుకు సదరు భక్తుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది ప్రదర్శించిన నిజాయితీ, సమయానుకూల అప్రమత్తత ,అంకితభావంతో కూడిన సేవాభావాన్ని భక్తుడు మహేష్ ఎంతగానో అభినందించారు. టీటీడీ భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేసి శ్రీవారి భక్తుడికి పెద్ద ఉపశమనం కలిగించింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?