Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నాపై కేంద్రం ఫైర్..
- భద్రతా ముప్పుగా మారుతాయంటూ ఆగ్రహం..
- బంగ్లాదేశ్, నేపాల్ ఘటనల ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాను చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో సహా కీలక కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాకు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజును కవర్‌గా ఉపయోగించుకున్న కాంగ్రెస్ నేతలు, అక్కడి నుంచి ఒక్కసారిగా ప్రధాని నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ పరీక్షా పేపర్ లీక్, సోమవారం పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దాడుల్ని నిరసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, ఈ ఆందోళనల భద్రతాపరంగా తీవ్రమైన ముప్పును సృష్టించడమే కాకుండా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రమాదకర ఉదాహరణ నెలకొల్పిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకుల అధికారిక నివాసాలను లక్ష్యంగా చేసుకుని నిరసన చేపట్టడం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో కనిపించదని పేర్కొన్నారు. ఇది భద్రతా ప్రమాదాలను పెంచడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
ప్రధాని నివాసం వద్ద నిరసన నిర్వహించడం హద్దులు దాటిన చర్యగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఘటనల్ని ప్రస్తావించాయి. బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా రాజీనామా అనంతరం నిరసనకారులు ఆమె అధికారిక నివాసం అయిన గణభవన్లోకి చొరబడిన ఘటనల్ని, నేపాల్‌లో రాజకీయ అశాంతి సమయంలో మాజీ ప్రధానులు, మంత్రుల నివాసాలపై దాడులను ఉదాహారణలుగా చూపింది. మరోవైపు, నిరసన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!