Pakistan Crisis: దాయది దేశం పద్మవ్యూహంలో చిక్కుకుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ మాస్టర్ వ్యూహకర్తగా ఉండటానికి ఉత్సాహపడుతుందని, కానీ ఆ దేశానికి అది సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం పాక్‌కు భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది, మరోవైపు బలూచిస్థాన్, ఖైబర్-పఖ్తుంఖ్వాలో రెండు అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి. ఈ సవాళ్లు అనే పద్మవ్యూహంలో పాక్ సైన్యం చిక్కుకోడానికి అనేక పాపాలు చేసిందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా దాయది దేశం డబుల్ గేమ్ ఆడుతున్నందుకు ఇప్పుడు శిక్ష పడుతోందని అంటున్నారు.
READ ALSO: SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?
ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు..
పాకిస్థాన్ అక్టోబర్ 9 రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, ఇతర నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. TTP ఆఫ్ఘన్‌లోని సురక్షిత స్థావరాల నుంచి దాడులు చేస్తుందని పాక్ పేర్కొంది. ఈ దాడుల్లో TTP నాయకుడు ముఫ్తీ నూర్ వలీ మెహ్సూద్ ప్రధాన టార్గెట్‌గా ఉన్నారు. 2018లో అమెరికా డ్రోన్ దాడిలో మౌలానా ఫజ్లుల్లా మరణించిన తర్వాత మెహ్సూద్ టీటీపీని ఏకం చేశాడు. 2025లో ఇప్పటివరకు టీటీపీ 900 మందికి పైగా పాక్ సైనికులను హతమార్చింది. అక్టోబర్ 7న ఓరక్జాయ్ జిల్లాలో టీటీపీ ఒక కాన్వాయ్‌పై దాడి చేసి, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 17 మంది సైనికులను చంపింది.
పాక్ చరిత్రలో కాబూల్‌పై జరిగిన ఈ దాడులు మొదటివి. యాదృచ్చికంగా ఇదే రోజు తాలిబన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలకు గుర్తుగా ఈ రోజు నిలిచింది. అదే సందర్భంలో తాలిబన్లను బెదిరించడానికి పాకిస్థాన్ ఈ దాడులను నిర్వహించింది, కానీ దీనికి కచ్చితంగా పాక్‌కు ఎదురుదెబ్బ తగలవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాయది దాడులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజా దాడులు ఆఫ్ఘన్-పాక్ సంబంధాలను మరింత దిగజార్చుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు సరిహద్దులో సైన్యం మోహరించాల్సి ఉంది..
పాకిస్థాన్ సైన్యం భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ దేశాల సరిహద్దులలో సైన్యాన్ని మోహరించాల్సి ఉంది. భారతదేశంతో పాక్‌కు దీర్ఘకాల వైరం ఉంది. మే 2025లో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలను నాశనం చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో టీటీపీ సమస్య పాకిస్థాన్‌ను చిక్కుల్లో పడేసింది. గతంలో పాకిస్థాన్ తాలిబన్లకు ఆశ్రయం కల్పించేది, కానీ ఇప్పుడు తాలిబన్లు టీటీపీకి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఖోస్ట్, పాక్టికా ప్రావిన్సుల నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాక్ సైన్యంపై దాడి చేస్తు్న్నారు. గతలో తాలిబన్లను పెంచి పోషించడం ద్వారా ఇప్పుడు పాకిస్థాన్ అనుభవిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
దేశంలో అంతర్గత తిరుగుబాట్లు..
పాకిస్థాన్‌కు బాహ్య శత్రువులతో పాటు దేశంలో చెలరేగుతున్న రెండు అంతర్గత తిరుగుబాట్లు సమస్యగా మారాయి. బలూచిస్థాన్‌లో, బలూచ్ తిరుగుబాటుదారులు వేర్పాటును కోరుతున్నారు. వారు చైనా – పాక్ ఆర్థిక కారిడార్ (CPEC) పై దాడి చేస్తారు. ఖైబర్-పక్తుంఖ్వాలో TTP, ఇతర రాడికల్స్ చురుకుగా ఉన్నారు. ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న పరిస్థితికి ఆ దేశ సైన్యం గతంలో చేసిన తప్పుల ఫలితం అని విశ్లేషకులు అంటున్నారు. 2001-2021 “ఉగ్రవాదంపై యుద్ధం” సమయంలో పాక్ US సహాయాన్ని అంగీకరించింది కానీ తాలిబాన్, అల్-ఖైదాకు ఆశ్రయం కల్పించింది. ఒసామా బిన్ లాడెన్ 2011లో అబోటాబాద్‌లో, ఆర్మీ అకాడమీ సమీపంలో చంపబడ్డాడు. ఈ డబుల్ ఒప్పందం ఇప్పుడు దాయది దేశానికి ఎదురుదెబ్బ తగులుతోంది.
పాక్‌లో అమెరికా ఆట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘన్ భూభాగానికి తిరిగి రావాలనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో ఆయన సోవియట్ కాలం నాటి ప్రధాన స్థావరం అయిన బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి అమెరికాకు అప్పగించాలనే డిమాండ్ చేశారు. మాస్కో ఫార్మేషన్ (భారతదేశం, చైనా, రష్యా) దీనిని వ్యతిరేకించాయి. పాకిస్థాన్ సైన్యం అమెరికా విశేషంగా ఆధారపడుతోంది. 1980లలో జియా-ఉల్-హక్ F-16లను పొందినట్లే, ప్రస్తుత పాక్ అధికార గణం కూడా అమెరికా నుంచి నిధులు, ఆయుధాలను అందుకుంటుంది. ముషారఫ్ 2006లో AMRAAM క్షిపణులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్ కొత్త AMRAAMలకు ఆమోదం తెలిపాడు.
పాక్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్..
పాక్ సంక్షోభం భారతదేశానికి శుభవార్త. తాలిబన్ మంత్రి ఢిల్లీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నట్లు సూచిస్తుంది. అయితే పాక్ ఆందోళన ఇండియాపై ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, భారతదేశం తన సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. S-400, రాఫెల్ అప్‌గ్రేడ్‌లను ఉపయోగించుకోవాలని, క్వాడ్‌కు మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు.
READ ALSO: Madhya Pradesh: శవంతో శృంగారం.. కామాంధుడి అరెస్ట్