Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Read Also: India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
అమెరికా విదేశాంగ విధానంపై కూడా కిరియాకౌ విమర్శలు గుప్పించింది. అమెరికా నియంతలతో సౌకర్యవంతంగా పనిచేస్తుందని, ప్రజస్వామ్య ఆదర్శాల కంటే స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక సాయంతో దీనిని కొనుగోలు చేసిందని చెప్పారు. ముషారఫ్ డబుల్ గేమ్ ఆడుతూ.. అమెరికాకు మద్దతు ఇస్తూనే, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల్ని భారత్ పైకి ఎగదోశారని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం అల్‌ఖైదాను పట్టించుకోలేదని, భారత్ గురించి పట్టించుకుందని చెప్పారు.
పాకిస్తాన్ అణు బాంబు రూపశిల్పి ఏక్యూ ఖాన్‌ను అమెరికా తలుచుకుంటే చంపేసేదని అన్నారు. ఇజ్రాయిల్ తరహాలో అమెరికా కూడా పాక్ అణు శాస్త్రవేత్తను హతమార్చేది కానీ, సౌదీ అరేబియా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో అమెరికా అతడిని వదిలేసిందని చెప్పారు. ఏక్యూ ఖాన్ అంటే తమకు ఇష్టమని, అతడితో కలిసి పనిచేస్తున్నామని సౌదీ చెప్పినట్లు వెల్లడించారు. అమెరికా-సౌదీ సంబంధం గురించి మాట్లాడుతూ.. సౌదీ నుంచి అమెరికా చమురు కొనుగోలు చేస్తుంది, వారు అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. సౌదీ అరేబయా, చైనా, భారత్ తమ వ్యూహాత్మక అవసరాలను పునర్నిర్వచించుకున్నందున ప్రపంచ శక్తి గతిశీలత మారుతోందని కిరియాకౌఅన్నారు.