Pakistan: భారత్‌తో యుద్ధానికి అసిమ్ మునీర్ ఆరాటం, బీజేపీ స్నేహం కోసం ఇమ్రాన్ ఖాన్..
- భారత్‌తో యుద్ధానికి అసిమ్ మునీర్ ఆరాటం..
- భారత్, బీజేపీలో స్నేహానికి ఇమ్రాన్ ఖాన్..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ సోదరి అలీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారనే పుకార్ల నేపథ్యంలో, మంగళవారం అతడి సోదరిని ప్రభుత్వం కలిసేందుకు అనుమతి ఇచ్చింది. దీని తర్వాత, ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
మే నెలలో జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ గురించి ప్రశ్నించిన సమయంలో..”అసిమ్ మునీర్ ఒక రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్, ఇస్లామిక్ కన్జర్వేటివ్. అతను భారతదేశంతో యుద్ధం కోసం తహతహలాడటానికి ఇదే కారణం. అతని ఇస్లామిక్ రాడికలైజేషన్ మరియు సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారిపై పోరాడటానికి అతన్ని బలవంతం చేస్తున్నాయి” అని అలీమా అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడిపించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆమె కోరారు.
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
Read Also: Shocking M*urders: “అందంగా ఉంటే అసూయ”.. కోడలు, కొడుకుతో సహా నలుగుర్ని చంపేసిన క్రూరురాలు..
‘‘ఇమ్రాన్ ఖాన్ స్వచ్ఛమైన ఉదారవాది అని, ఇమ్రాన్ అధికారంలో వచ్చినప్పుడల్లా, అతను భారత్‌తో, బీజేపీతో కూడా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారని మీరు భావిస్తున్నారు. ఈ రాడికల్ ఇస్లామిస్ట్ అసిమ్ మునీర్ ఉన్నప్పడల్లా భారత్, దాని మిత్ర దేశాలతో యుద్ధం జరగడం మీరు చూస్తారు. ఇమ్రాన్ ఒక ఆస్తి.’’ అని ఆమె అన్నారు.
అంతకుముందు, ఇమ్రాన్ మరో సోదరి ఉజ్మా ఖానుమ్ ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలులో కలుసుకున్నారు. ‘‘అసిమ్ మునీర్ చరిత్రలో అత్యంత నిరంకుశ నియంత. అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు వారికి మిగిలింది నన్ను హత్య చే యడమే’’ అని ఇమ్రాన్ తనతో అన్నారని అతడి మరో సోదరి ఉజ్మా చెప్పారు. తనను, తన భార్యను తప్పుడు కేసులో ఇరికించారని, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరణశిక్ష విధించబడిని వ్యక్తి ఉన్న సౌకర్యాలే తనకు ఉన్నాయని, జంతువుల కన్నా దారుణంగా చూశారని ఆయన చెప్పినట్లు అతడి సోదరి వెల్లడించింది. మునీర్ విధానాలు పాకిస్తాన్‌కు వినాశకరమైనవని, దేశంలో ఉగ్రవాదం క్యాన్సర్ లా అదుపు తప్పిందని విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!