Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి ఈ రోజులో 75 ఏళ్లు నిండాయి. రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్ దేశాధినేతలు తమ శుభాకాంక్షలను స్వయంగా మోడీకి తెలియజేశారు. అయితే, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క దేశం మాత్రం,
Pakistan: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత వారం పాకిస్తాన్‌లోని బాలాకోట్ తహసీల్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమం ఉగ్రవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహవల్పూర్పై భారత వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. భారత్ ‘‘అజర్ కుటుంబాన్ని హతమార్చింది’’ని కాశ్మీరీ అంగీకరించారు.
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే దోహదపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించుకున్నారు. తాను వాణిజ్యంతో భయపెట్టడం వల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ప్రగల్భాలు పలికారు. అయితే, ఈ వాదనల్ని భారత్ మొదటి నుంచి ఖండిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సాక్షాత్తుగా పార్లమెంట్లో కాల్పుల విరమణలో ఏ దేశ జోక్యం లేదని స్పష్టం చేశారు.
Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇది…
PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వార్తాపత్రికలను డెలివరీ చేయడాన్ని పాకిస్తాన్ నిషేధించింది. దీనిని పాకిస్తాన్ సంకుచిత మనస్తత్వం కలిగిన చర్యగా, వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి? దాని కింద ఏ హక్కులు ఇవ్వబడ్డాయి? ఆ వివరాలు మీకోసం.. స్వతంత్ర, సార్వభౌమ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి 1961లో వియన్నా సమావేశం మొదటిసారి జరిగింది. దీని కింద, దౌత్యవేత్తలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంతర్జాతీయ ఒప్పందానికి నిబంధన విధించారు.…
Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి,…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము చాలా విజయాలు సాధించాము. భారత్-పాకిస్తాన్ ఉన్నా్యి. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా-కాంగో ఉన్నాయి’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ రుట్టేతో జరిగిన సమావేశంలో అన్నారు.