Mallikarjun Kharge: ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొన్ని వైమానిక నష్టాలు కలిగినట్లు ఈ రోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ అంగీకరించారు. తప్పులను సరిదిద్దుకున్న తర్వాత వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌లోకి వెళ్లి దాడులు చేసినట్లు చెప్పారు.
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పుకుంటూ వస్తున్న దాయాది పాకిస్తాన్, ఒక్కొక్కటిగా నిజాలను చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ ప్రధాని భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని ఒప్పుకున్నారు. మే 9-10 రాత్రి భారత్ రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది, తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందని, పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చిక్కుకుందని పాకిస్తాన్…
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా…
Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.
పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి.
బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
ఇండియన్ నౌవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు దగ్గరగా వచ్చింది.. మన దేశానికి కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.. కానీ, విక్రాంత్ పై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసి తీవ్రంగా నష్టం కలిగించిందని అబద్దపు మాటలు చెప్పుకొచ్చారు షెహబాజ్ షరీఫ్.
India Pakistan Conflict: పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా పేర్కొన్నారు.