Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి చేయడం వల్ల ప్రపంచ దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్…
Indus Water treaty: పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకునే వరకు భారతదేశం ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలుపుదలలో ఉంచుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం చెప్పారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని రోజుల తర్వాత విదేశాంగ శాఖ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
భారత్ పహల్గాం టెర్రర్ ఎటాక్ కు ప్రతీకారంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ను గడగడలాడించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యింది. ద్వైపాక్షిక ఒత్తిడి తెచ్చేందుకు నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,…
India-Pakistan War: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్, పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో పాక్ కి చెందిన డ్రోన్లు దూసుకు రావడంతో భారత రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. వరుస ఘటనలతో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు.
Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది.…
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం రాత్రిపూట దానిని ఉల్లంఘించి భారత్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ స్వయంగా దివాలా అంచున ఉన్న సమయంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1 బిలియన్ల సహాయాన్ని అందుకుంది. నిజానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా దారుణమైన స్థితిలో ఉంది. Also Read:Mrunal Thakur : ఆ క్షణం…
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం…