Turkey: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ‘‘కాశ్మీర్’’ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. పలు సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా, మరోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ( UNGA ) వార్షిక సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై మాట్లాడారు.
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక…
Pakistan: ఆపరేషన్ సింధూర్‌తో పాక్ పీచమనిచినా దాయాది బుద్ధి మాత్రం మారడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం లష్కరే తోయిబా (LET) ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబాపై బాంబులతో విరుచుకుపడింది. ఈ ఉగ్రకేంద్రం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో ఉంది. భారత్ దాడిలో లష్కరే కమాండ్ సెంటర్, కేడర్ వసతి, ఆయుధాల నిల్వ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఉమ్-ఉల్-ఖురా బ్లాక్‌లు ఖతం అయ్యాయి. READ ALSO: Weather Update…
Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత్ పై అక్కసు వెల్లగక్కుతున్నాడని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆరోపించారు. ట్రంప్ తప్పుడు విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. చైనా కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని, కానీ అమెరికా చైనాపై సుంకం విధించలేదని బోల్టన్ అన్నారు. సుంకాల ప్రభావాన్ని రద్దు చేయడానికి సమయం పడుతుందని బోల్టన్ హెచ్చరించారు. “గత…