Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ వైమానిక దళాలనికి చెందిన కీలక ఆస్తులపై దాడులు చేసింది.
Read Also: Bihar: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
ఇండోనేషియా సెమినార్‌లో పాకిస్తాన్ 6- ఫైటర్ జెట్లను, 2- సాబ్-2000 ఎరిఐ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్(అవాక్స్) విమానాలను, ఒక సీ-130 హెర్క్యూలర్ విమానాన్ని కోల్పోయినట్లు చెప్పారు. దీంతో పాటు పాకిస్తాన్‌లోని పలు వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు సెమినార్‌లతో వెల్లడించారు. ఈ సెమినార్‌ని ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్, భారత్-పాకిస్తాన్ ఎయిర్ వార్‌ని, స్ట్రాటజీలను చర్చించేందుకు నిర్వహించింది. భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 ఎయిర్‌బేస్‌లు- నూర్ ఖాన్, భొలారి, సర్గోదా, రఫికీ, జకోబాబాద్ వంటి కీలక వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులతో భారత్ దాడి చేసింది.
పాకిస్తాన్ కోల్పోయిన ఫైటర్ జెట్లలో రెండు జేఎఫ్-17 థండర్,రెండు మిరేజ్ విమానాలు, ఒకటి ఎఫ్-16 బ్లాక్ 52, ఎఫ్-16ఏ/బీ-15 ఎస్ ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ అవాక్స్ విమానాలను భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో ఉన్న సీ-130 ట్రాన్స్‌పోర్ట్ విమానం కూడా బ్రహ్మోస్ దాడిలో ధ్వంసమైంది. ఇదే కాకుండా 30- క్షిపణులు, ఇందులో చైనీస్ తయారీ పీ-15, ఫతాహ్-2 రాకెట్లు, 10 డ్రోన్లను భారత్ ఎస్-400, ఆకాష్, బారాక్-8 ఉపయోగించి ధ్వంసం చేసింది. చైనా పాకిస్తాన్‌కి ఇచ్చిన హెచ్‌క్యూ-9, వైఎల్సీ-8ఈ వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని కూడా మన బలగాలు దెబ్బతీసినట్లు సెమినార్‌లో వెల్లడించారు.