మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభ ఛైర్మన్.. ప్రతిపక్షం పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సభలో ప్రతిపక్షంపై చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓటమి పాలైంది. కూటమిలో పార్టీకి ఆశించ దగ్గ సీట్లు రాలేదు. ఓ వైపు ఈవీఎంలపై నెపం నెడుతున్నా.. ఇంకోవైపు పార్టీలో విభేదాలు మాత్రం కొట్టిచ్చినట్లు కనబడుతున్నాయి.
INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు…
INDIA bloc: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత, ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీని ఇండియా కూటమి చీఫ్‌గా నియమించాలని తృణమూల్ ఎంపీ కీర్తి ఆజాద్ కొత్త చర్చని లేవదీశారు. ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు మమతా బెనర్జీ సరైన వ్యక్తి అని, ఆమెకు ఆ రికార్డు ఉందని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. తిరిగి ఆరు నెలల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు.