పశ్చిమ బెంగాల్‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్‌లో అధికారంలో తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పొత్తు ఉండబోదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.
INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు. Read Also: Asteroid: భూమికి…
కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు.
Omar Abdullah: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యం.. ఇలా చేయడం భారతీయ జనతా పార్టీతో కలిసినట్టు కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు.
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి.
End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు.
ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉండాలని సూచించారు. కూటమిలోని ఇంకో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ తెలిపారు.
జమిలి.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. ఏ నాయకుడి నోట విన్నా.. ఏ రచ్చ బండ దగ్గర కూర్చున్నా.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతగా జమిలి పేరు మార్మోగడానికి కారణం. మోడీ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరికొత్త రాజకీయ ఆలోచనకి పునాది.