INDIA bloc Rift widens: ‘ఇండియా’ కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్
- ఇండియా కూటమిలో చీలికలు..
- మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించాలని లాలూ ప్రసాద్ డిమాండ్..
- ఇండియా బ్లాక్ బాధ్యతలను దీదీకి ఇవ్వాలని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన ఈ రోజు (డిసెంబర్ 10) పాట్నాలో వెల్లడించారు. బెంగాల్ సీఎంకు ఇండియా బ్లాక్ బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పుకొచ్చారు.
Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
అలాగే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత వల్ల ఇండియా కూటమిలో ఎలాంటి మార్పు రాదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే టీఎంసీ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీని పలుమార్లు మమతా ఓడించారని.. అలాంటిది భారత కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం మంచిదని ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాలు కోరితే ఈ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. దీంతో ఇండియా బ్లాక్ లో చర్చ ప్రారంభమైంది. అయితే, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.
Read Also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీయే చేతిలో ఓడిపోయేంత వరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని తన వాయిస్ ని వినిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో, మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించడానికి అన్ని రకాలుగా అర్హురాలని తెలిపారు. దీదీ కూడా 42 లోక్‌సభ స్థానాలతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!