Hemant Soren: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. రాంచీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు.
UP bypolls: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, ఏఐసీసీ సంస్థ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్…
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బై ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'పైనే పోటీ చేస్తారని వెల్లడించారు.
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో ఖర్గే పర్యటించారు. ఈ సందర్భంగా కమలం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు.
Champai Soren: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) పార్టీ కీలక నేత చంపాయి సోరెన్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్లడం కూడా అనుమానాలను బలపరుస్తోంది.