పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. పట్టుమని ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. నిరసనల పర్వంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికా లంచాల వ్యవహారం బయటపెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రూపాల్లో పార్లమెంట్ బయట, లోపల ఆందోళనలు సాగిస్తున్నారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం సాగుతోంది.
తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో సంపద సృష్టికర్తలు, ఉద్యోగవకాశాలను కల్పించేవారికి రాజకీయాలను ఆపాదించిడం సరికాదని హితవు పలికారు. భారతీయ వ్యాపార అభివృద్ధి చెందడం ముఖ్యమని చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో జరగుతున్న పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు పేర్కొన్నారు. ఏవైనా అవకతవకలు చోటుచేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు ఉండాలన్నారు. అంతేకానీ.. రాజకీయంగా ఫుట్‌బాల్ ఆడటం తగదని పేర్కొన్నారు.
నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి అదానీ అంశం, సంభల్ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. అదానీ లంచం ఇచ్చినట్టు అమెరికా నమోదైన అభియోగాల వ్యవహారంపై చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు గళమెత్తుతున్నాయి. సభాకార్యక్రమాలకు విపక్షాలు అడ్డుపడడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. అలాగే రైతు పండించిన పంటల మద్దతు ధరకు చట్టబద్దత, మణిపూర్ హింస, నిరుద్యోగంపై కూడా చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి.
It is disheartening to observe disruptions in the Indian Parliament, particularly when we aspire to be a beacon of democracy for the world. The wealth creators and job providers of India should not become subject of political rhetoric.. If there are discrepancies, that can be…
— Sadhguru (@SadhguruJV) December 12, 2024