శివసేన (యూబీటి) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ను అమీబాతో పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని ఫ్రంట్‌కు ఖచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని అన్నారు.
ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది.
ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు