Ind vs Wi: వెస్టిండీస్పై వన్డే సిరీస్ను సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ పైన కూడా కన్నేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1 తేడా భారత్ ముందంజలో ఉంది. ఇవాళ జరగనున్న నాలుగో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. ఇవాళ్టి టీ20 మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్…
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా…
IND Vs WI: బస్టెర్రె వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. అభిమానులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరింది. మ్యాచ్ జరిగే బస్టెర్రెలోని వార్నర్ పార్క్కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో అనుకున్న సమయానికి…
Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…
IND Vs WI: శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే సమరం ముగిసింది. నేటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 సిరీస్ సమరానికి తెర లేవనుంది. వన్డే సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ కూడా చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ ఆటగాళ్లు టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చారు. వన్డే సిరీస్లో తుది జట్టులో ఆడిన…
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలలో గెలిచి సిరీస్ గెలిచిన టీమిండియా మూడో వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే మూడో వన్డేలో జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లైనప్లో పెద్దగా మార్పులు చేయకపోయినా బౌలింగ్లో మార్పులు తప్పనిసరిగా కనిపిస్తోంది. అవేష్ ఖాన్…