Shai Hope Breaks Virat Kohli Record With Latest Century: రెండో వన్డేలో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓటమి చవిచూసిన సంగతి పక్కనపెట్టేస్తే.. సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, సొగసైన షాట్లతో సునాయాసంగా శతకం బాదాడు. 135 బంతులాడిన ఇతను 8 ఫోర్లు, మూడు సిక్స్‌ల సహాయంతో 115 పరుగులు చేశాడు. తన వందో వన్డే మ్యాచ్‌లో అతడు సెంచరీ చేయడం…
Team India Record: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్‌ల్లో గెలిచిన పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా ఆ జట్టు రికార్డును భారత్ బద్దలు కొట్టింది. తాజాగా వెస్టిండీస్‌పై వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకుని టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో పాకిస్థాన్ రెండో…
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో అద్భుత రీతిలో విజయం సాధించింది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన టీమిండియాను స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు…
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో నేడు టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా కేవలం మూడు పరుగుల తేడాతోనే భారత్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆదివారం సమష్టిగా రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో కనిపిస్తోంది. అటు తొలి వన్డేలో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని చేజార్చి చింతిస్తున్న వెస్టిండీస్ రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో…
కరేబియన్ పర్యటనను విజయంతో ప్రారంభించింది... టీమిండియా. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో... 3 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది.
Team India scored 308 runs against west indies in first odi పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ధావన్ (97), శుభ్‌మన్ గిల్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ధావన్ మూడు పరుగుల తేడాలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ధావన్-గిల్ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.…
India Vs West Indies First Odi వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును శిఖర్ ధావన్ నడిపించనున్నాడు. తన కెరీర్లో రెండోసారి టీమిండియాకు ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలను చేపట్టాడు. ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా…