న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్‌కు తాకరాని చోట గట్టిగా తాకింది. దాంతో అతడు మైదానంలోనే కుప్పకూలి.. నొప్పితో వివవిల్లాడాడు. టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చి ప్రథమ చికిత్స చేశాడు. కాసేపటికి రాహుల్ నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. ఆపై బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…
IND vs WI: ఢిల్లీ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 2వ టెస్ట్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తోలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 175 పరుగులు, శుభమన్ గిల్ 129* చేయడంతో భారీ స్కోర్ చేసింది. వీరితోపాటు సాయి సుదర్శన్ 87, నితీష్ కుమార్ 43, ధ్రువ్ జురేల్ 44 పరుగులతో జట్టుకు…
టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్‌గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్…
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశాడు. మొదటి రోజు బ్యాటింగ్‌లో (87) అదరగొట్టిన సాయి.. రెండో రోజు ఫీల్డింగ్‌లో ఔరా అనిపించాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లోని రెండో బంతిని విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ షాట్ ఆడగా.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. బంతి వేగంగా దూసుకురాగా.. ముందుగా సాయి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (173; 253 బంతుల్లో 22 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగాడు. యశస్వితో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్…
IND vs WI: ఢిల్లీలో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ లో నేడు (అక్టోబర్ 10) భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి రోజు మొదటి సెషన్ ను టీమిండియా స్లో అండ్ స్టడీగా కొమసాగింది. దీంతో లంచ్ సమయానికి టీమిండియా 28 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 94 రన్స్ చేసింది. ఇక లంచ్ సమయానికి యశస్వి జైస్వాల్ 78 బంతుల్లో 40 రన్స్, సాయి సుదర్శన్ 36 బంతుల్లో…
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి తర్వాత వెస్టిండీస్ హెడ్ కోచ్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తాను విమర్శలకు సిద్ధంగా ఉన్నానని ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కరేబియన్ టెస్ట్ జట్టు పతనానికి ఇటీవలి తన నిర్ణయాలు కాదని, దశాబ్దాల నాటి లోపాలే అని స్పష్టం చేశాడు. ఢిల్లీలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు…
IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్‌పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్‌బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో…
IND vs WI: అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో డ్రింక్స్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ చెలరేగడంతో వెస్టిండీస్ వికెట్లు వరుసగా కోల్పోయింది. Kaleshwaram Projcet : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం వెస్టిండీస్ బ్యాట్స్మెన్లలో షై…
IND vs WI: అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ మంచిగా ఉందని, ఇందులో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఆటగాళ్లు బాగానే ఆడతారని చేజ్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో పాయింట్లు సాధించడం తమ లక్ష్యమని, ఈ పిచ్‌పై చివరిగా బ్యాటింగ్ చేయాలనుకోవడం లేదని తెలిపాడు. ఇక వెస్టిండీస్ తరపున ఖారీ పియెర్, జోహాన్ లేన్ అరంగేట్రం…