Ruturaj Gaikwad will get a chance in the India vs West Indies T20 series : డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి అనంతరం భారత జట్టు విరామంలో ఉంది. నెల రోజుల విశ్రాంతి అనంతరం జులై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు ముందు టెస్టు, టీ20 జట్టులో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని సమాచారం తెలుస్తోంది. టెస్టుతో పాటు టీ20 సిరీస్‌లోనూ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ చూస్తోందట.
టీ20 సిరీస్‌లో కీలక మార్పులు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కనుందట. ఐపీఎల్ 2023లో గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్‌లు ఆడి 42.14 సగటు, 147.50 స్ట్రైక్ రేట్‌తో 590 రన్స్ చేశాడు. అందుకే భారత జట్టులో మరోసారి అవకాశం దక్కనుంది. గైక్వాడ్ ఇప్పటివరకు భారత్ తరఫున 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 135 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 57. గైక్వాడ్ జూన్ 26 2022న ఐర్లాండ్‌తో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర! లేటెస్ట్ రేట్లు ఇవే
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి (Shubman Gill is likely to be rested for IND vs WI T20 Series) ఇవ్వవచ్చని సమాచారం తెలుస్తుంది. గిల్ గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్‌కు భారత టీ20 జట్టులో అవకాశం లభించనుంది. ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన గైక్వాడ్.. ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మరి ఈసారి లభించే అవకాశంను అతడు సద్వినియోగం చేసుకుంటే.. మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. టీ20 సిరీస్‌కు గిల్ విశ్రాంతి తీసుకున్నా.. టెస్ట్ సిరీస్‌లో మాత్రం ఆడతాడు.
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన యశ్వసి జైస్వాల్, రింకూ సింగ్, ముకేష్ కుమార్ భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2023లో ధారాళంగా పరుగులు ఇచ్చినా.. చెన్నై జట్టులో అత్యధిక వికెట్లు తీశాడు. చెన్నై తరఫున ఆడిన 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. మరి చూడాలి బీసీసీఐ ఎవరికి అవకాశం ఇస్తుందో.
Also Read: Mahalakshmi Stotram: శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేరుకూరుతాయి