వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆ తర్వాత జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Also Read : Telangana Congress: కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్.. డీఎస్ క్లారిటీ..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ నెలలో శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ తో వన్డే సిరీస్ లను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ ప్లాన్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్, వెస్టిండీస్ మధ్య జరిగేలా బీసీసీఐ విండీస్ బోర్డు ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజాగా మరో రెండు టీ20 లని కూడా ఈ సిరీస్ లో యాడ్ చేయాలని బీసీసీ ప్లాన్ చేస్తోంది. వెస్టిండీస్ టూర్ ముగిసిన వెంటనే ఆగస్టులోనే ఐర్లాండ్ పర్యటనకి భారత జట్టు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లని టీమిండియా ఆడనుంది.
Also Read : Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
అలాగే సెప్టెంబర్ లో పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఆసియా కప్-2023 టోర్నీ ప్రారంభంకానుంది. ఆ టోర్నీలో ఆడేందుకు పాక్ గడ్డపైకి భారత జట్టు వెళ్లాల్సి ఉంది. కానీ.. టీమిండియాను అక్కడికి పంపించేందుకు భారత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. దాంతో ఆసియా కప్ లో భారత ఆడే మ్యాచ్ లను మరో దేశంలో ( అటు భారత్, ఇటు పాకిస్థాన్ కాకుండా ) నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ గడ్డ మీద జరిగే ఆసియాకప్ టోర్నీలో భారత్ అడుగుపెట్టకుండానే దుబాయ్ లో ఆడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.