IND Vs SA: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ముచ్చటగా మూడో సమరానికి సన్నద్ధమైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచిన టీమిండియా మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో…
టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి, పసికూన జట్టు నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి మంచి జోరు మీదున్న టీమిండియాకు గట్టి పోటీ ఎదురైంది. రోహిత్ సేన ఆదివారం కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్‌లోని మిగతా జట్లలో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను టీమిండియా ఇవాళ ఢీకొంటోంది.
IND Vs SA: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. టీమిండియా మంచి ప్రదర్శనే చేస్తున్నా ఓపెనర్ రాహుల్ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో ఆదివారం ఆడనున్న మ్యాచ్‌లో అతడి స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్…
IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత…
IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానేమన్ మలాన్…
IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ…
రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే…