IND Vs SA: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ముచ్చటగా మూడో సమరానికి సన్నద్ధమైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచిన టీమిండియా మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Read Also: T20 World Cup: మెగా టోర్నీలో పాకిస్థాన్ బోణీ.. నెదర్లాండ్స్‌పై విజయం
అటు దక్షిణాఫ్రికా కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పుతో బరిలో దిగుతోంది. బంగ్లాదేశ్‌తో ఆడిన స్పిన్నర్ షాంసీ స్థానంలో పేస్ బౌలర్ లుంగి నింగిడిని తుది జట్టులోకి తీసుకుంది. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికాకు కూడా ఇది మూడో మ్యాచ్. జింబాబ్వేతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా బంగ్లాదేశ్‌తో ఘనవిజయం సాధించింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రోసౌ, స్టబ్స్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, పార్నెల్, మహరాజ్, రబాడ, నోర్జ్, లుంగీ నింగిడి