రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే…
South Africa: రాంచీలో నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ మిల్లర్ కుమార్తె శనివారం నాడు మృతి చెందింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘రిప్ మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయితే…
Shikar Dhawan: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ జిడ్డు బ్యాటింగ్ ఆడటంతో రన్‌రేట్ కొండెక్కింది. చివరకు సంజు శాంసన్ పోరాడినా ఫలితం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన…
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
IND Vs SA: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులో ఎంపికైన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే బర్త్ డే బాయ్ రిషబ్ పంత్ 27…
IND Vs SA: ఇండోర్‌లో టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ మరోసారి రాణించాడు. అతడు 43 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోసౌ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో…
IND Vs SA: ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా మూడు మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించింది. అటు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెట్టి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంది.…