IND vs SA: కోల్‌కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Police Arrested A Man for selling IND vs SA Black Tickets: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పటిష్ట దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే కావడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ మ్యాచ్‌కు భారీ హైప్ ఏర్పడింది.
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ చూడాలని అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబందించిన టికెట్స్ ఆన్‌లైన్‌లో ఇప్పటికే అమ్ముడయ్యాయి. దాంతో బ్లాక్ దందా తెరపైకి వచ్చింది. అభిమానుల క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని బ్లాక్ బకాసురులు చూస్తున్నారు. మంగళవారం ఓ వ్యక్తి రూ. 2500 టికెట్‌ను ఏకంగా రూ. 11000 ధరకు అమ్ముతుండగా కోల్‌కతా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో అతడి ఇంటిపై కూడా పోలీసులు రైడ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అంకిత్ అగర్వాల్ అని తెలుస్తోంది.
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్కో టికెట్‌ను ఇంత ఎక్కువకు అమ్ముకోవడం ఏంటి? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ నవంబర్ 2న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. భారత్ ఫామ్ చూస్తే లంకపై విజయం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!