Anushka Sharma-Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ అనంతరం విరాట్ ఫుల్ జోష్‌లో కనిపించాడు. భారత్ ఫీల్డింగ్ సమయంలో మైదానంలోనే డాన్స్ చేశాడు.
బర్త్ డే రోజున సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా ఛేజింగ్ సమయంలో మంచి హుషారుగా కనిపించాడు. తనదైన స్టైల్‌లో ఫీల్డింగ్ చేస్తూ సహచరులతో పాటు అభిమానాలను అలరించాడు. దక్షిణాఫ్రికా అప్పటికే 7 వికెట్స్ కోల్పోయి ఓటమి దిశగా వెళుతోంది. ఈ సమయంలో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సాంగ్స్ వస్తుంటే.. ఫాన్స్ డాన్సులు చేశారు. మైదానంలో ఉన్న కోహ్లీ కూడా స్టెప్పులు వేశాడు. తన భార్య అనుష్క శర్మ నటించిన సినిమాలోని ‘అయినవీ అయినవీ’ పాటకు డాన్స్ చేశాడు. పఠాన్ సినిమాలోని ‘చలెయా చలెయా’ సాంగ్‌కు కూడా డ్యాన్స్ చేశాడు విరాట్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
Also Read: Ravindra Jadeja: ఫీల్డింగ్‌లో నేనే పెద్ద తోపును అని ఫీల్ కాను: రవీంద్ర జడేజా
వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమానంగా 49 సెంచరీలు బాదాడు. 2009లో శ్రీలంకపై ఈడెన్ గార్డెన్స్‌లోనే విరాట్ తొలి వన్డే సెంచరీ అందుకోవడం విశేషం. సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే క్రికెట్లో ఇప్పటివరకూ కేవలం సచిన్, కోహ్లీ మాత్రమే 35 శతకాలకు పైగా నమోదు చేశారు. మరో శతకం బాదితే.. సెంచరీల హాఫ్ సెంచరీ రికార్డును కోహ్లీ నెలకొల్పుతాడు. సచిన్ 452వ ఇన్నింగ్స్ (463 మ్యాచ్)లో 49వ వన్డే సెంచరీ చేస్తే.. విరాట్ 277వ ఇన్నింగ్స్ (289 మ్యాచ్)లోనే ఆ రికార్డు సమం చేశాడు.
Virat Kohli dance moves 😍#ViratKohli #ICCCricketWorldCup23 pic.twitter.com/wynsqFgYDe
— Sanjeev Dherdu (@sanjeevdherdu) November 5, 2023
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!