IND Vs SA: గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారీ స్కోరు చేయడంతో టీమిండియా బతికిపోయింది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ విజయపు అంచుల వరకు తీసుకువెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే…
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌లో పరుగులు పోటెత్తాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బలమైన పునాది వేయగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ విధ్వంసం సృష్టించారు. చివర్లో దినేష్ కార్తీక్ కూడా తనదైన చేయి వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు,…
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి విశేష అతిథి ప్రవేశించాడు. ఆ అతిథి ఎవరో అని తెగ ఆలోచించకండి. ఆ అతిథి పాము. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి పాము రావడంతో అభిమానులు భయంతో వణికిపోయారు. 7వ ఓవర్ పూర్తైన తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఒక్కసారిగా పాము గ్రౌండ్లోకి రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పామును చూసి ఆటగాళ్లు కూడా హడలిపోయారు. అనంతరం గ్రౌండ్…
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రెండో టీ20 సమరానికి సిద్ధమైంది. గౌహతి వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 ఆడిన జట్టుతోనే భారత్ ఆడనుంది. దక్షిణాఫ్రికా మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. షాంసీ స్థానంలో లుంగీ ఎంగిడికి స్థానం కల్పించింది. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0…
అస్సాంలోని గువాహటి వేదికగా రెండో టీ-20 ఆడేందుకు భారత్, దక్షిణాఫ్రికాలు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తుండగా.. మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలతో ఉంది.
IND Vs SA 1st T20: తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూసింది. రోహిత్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటై నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (51 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి…
IND Vs SA 1st T20:తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఒక దశలో సఫారీల జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు 10 ఓవర్లలోపే ఆలౌట్ అవుతుందని అనిపించింది. కానీ లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో ఆ జట్టు పూర్తి ఓవర్లను ఆడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్లోనే దీపక్ చాహర్ వికెట్ల పతనానికి…
IND Vs SA 1st T20: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పలు మార్పులు చేసింది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. ఆశ్చర్యకరంగా తొలి మ్యాచ్‌కు బుమ్రాను కూడా దూరం పెట్టారు. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్‌కు…
IND Vs SA: కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం నాడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం అటు విరాట్ కోహ్లీ అభిమానులు, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు పోటాపోటీగా కటౌట్లు ఏర్పాటు చేయడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలో తొలుత విరాట్ కోహ్లీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు.…