Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు.…
Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో ఆదివారం రాత్రికి హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది కెరీర్లో 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక…
Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు అభిమానుల్లో తెలియని భావోద్వేగం చోటు చేసుకుంటుంది. దీంతో అది ఎలాంటి మ్యాచ్ అయినా చూసేందుకు అభిమానులు ఎగబడతారు. కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆసియాకప్‌లో ఈనెల 28న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో మైదానంలో యుద్ధం లాంటి వాతావరణాన్ని చూడాలని అభిమానులు…
Asia Cup 2022: ఈనెల 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాది దేశాలు ఇప్పటివరకు తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల తేదీని…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ యొక్క షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తం ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ 2022 మార్చి 4న న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల మధ్య జరుగుతుంది. ఇక ఇందులో టీం ఇండియా తమ మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుతో మార్చి 6న తలపడుతుంది. కాబట్టి ఈ…
భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కంటే టీ20 ఫార్మాట్ లో చాలా బలంగా ఉంటుంది. అది ఈ మధ్యే రుజువైంది కూడా. ఐసీసీ ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారి యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మన టీం ఇండియా ను పాక్ జట్టు ఓడించింది. అయితే ఇప్పుడు వారు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు.…
ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకముందే భారత జట్టు భయపడుతుంది అని అన్నారు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ టోర్నీ ప్రారంభంకాకముందే భారత జట్టు “ఒత్తిడిలో మరియు భయంలో ఉంది అని ఇంజమామ్ అన్నారు. ఇక ఈ పాక్ తో మ్యాచ్ అనంతరం భారత్ తన తదుపరి…
యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తన ప్రయాణాన్ని పాకిస్థాన్ తో మొదలు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక తాజాగా ఈ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు అని ఐసీసీ ప్రకటించింది. మన జట్టు ఓడిపోయినా.. ఇండియాలోనే ఈ మ్యాచ్ ను అత్యధికంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు అభిమానులు చూసారు. ఇక ఇన్ని రోజులు ఈ అత్యధిక…
ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే…