India vs Pakistan: దీపావళి ధమాకా.. విరాట్ విశ్వరూపం.. పాక్‌పై భారత్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won Against Pakistan In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ శుభారంభం చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో.. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. పాక్ కుదిర్చిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేధించింది. విరాట్ కోహ్లీ (82) విశ్వరూపం చూపించడంతో పాటు హార్దిక్ పాండ్యా రాణించడంతో.. భారత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒకానొక దశలో ఓడిపోతుందనుకున్న భారత్.. చివర్లో నెగ్గింది. దాయాది దేశాన్ని మట్టికరిపించి, ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంటనే ఔటైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్(51) అర్థశతకాలతో లాక్కొచ్చారు. మూడో వికెట్‌కి 76 పరుగులు జత చేసి, తమ పాక్ జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత వరుస వికెట్లు పడినా, ఓవైపు మసూద్ పరుగుల వర్షం కురిపించాడు. చివర్లో అతనికి షాహీన్ ఆఫ్రీది చేయూతనందించడంతో, పాక్ జట్టు 159 పరుగులు చేయగలిగింది. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడింది. వరుస వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడిపోయింది. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం, తొలి 10 ఓవర్లలో 45 పరుగులే చేయడంతో.. భారత్ నెట్టుకురావడం దాదాపు కష్టమేనని అంతా భావించారు.
Also Read
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
అయితే.. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మాత్రం మ్యాచ్‌ని ఒక్కసారిగా మలుపు తిప్పేశారు. వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా.. మొదట్లో చాలా మెల్లగా ఆడిన కోహ్లీ, ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టేశాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో భారత్ మళ్లీ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే.. బౌలర్ ఒక నోల్ బాల్ వేయడం, కోహ్లీ కూడా సిక్స్‌తో చెలరేగడంతో, చేధన సులభతరం అయ్యింది. 2 బంతుల్లో 2 పరుగులు చేయాలన్నప్పుడు కార్తీక్ ఔటయ్యాడు. చివర్లో వచ్చిన అశ్విన్.. సింగిల్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఏదేమైనా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ హీరోగా నిలిచాడు.
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!