టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
Ravichandran Ashwin: గత ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి ఓవర్లో ఐదో బంతిని అశ్విన్ ఆడకుండా వదిలేయడంతో అది వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ బంతి మలుపు తిరిగి ప్యాడ్లను తాకి…
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.…
Team India: మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్‌లో మ్యాచ్‌లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శనివారమే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. రెండో రోజే టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్వళ్లూరుతోంది. అయితే అందరి కళ్లు ఇరు జట్ల ఆటగాళ్లపై కాకుండా వరుణుడిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌కు వర్షం…
T20 World Cup: బ్రిస్బేన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షం గబ్బా మైదానాన్ని ముంచెత్తడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మెగా టోర్నీకి ముందు టీమిండియాకు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను కేటాయించగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో…