IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్‌బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.
తుది జట్ల వివరాలు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్, షమీ, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, హైదర్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫ్ అలీ, షాహిన్ అఫ్రిదీ, హరిస్ రౌఫ్, నసీమ్ షా.
🚨 Toss Update & Team News from MCG 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against Pakistan. #T20WorldCup | #INDvPAK
Follow the match ▶️ https://t.co/mc9useyHwY
Here's our Playing XI 🔽 pic.twitter.com/1zahkeipvm
— BCCI (@BCCI) October 23, 2022