భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు. ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే తమ మద్దతును ప్రకటించాయి.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల…
Team India: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 15 ఏళ్లు గడిచినా మరోసారి టీమిండియా మాత్రం మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సెమీస్‌కు చేరిన రోహిత్ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. సమష్టిగా ఆడితే ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం అసాధ్యమేమీ కాదని అభిమానులు విశ్వసిస్తున్నారు. అటు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్…
టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
Ravichandran Ashwin: గత ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ షాట్ కొట్టడంతో టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి ఓవర్లో ఐదో బంతిని అశ్విన్ ఆడకుండా వదిలేయడంతో అది వైడ్‌గా వెళ్లింది. ఒకవేళ బంతి మలుపు తిరిగి ప్యాడ్లను తాకి…
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్‌తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.