IND vs PAK: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్ A జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ A చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ A.. తొలి 10 ఓవర్లలో 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన భారత్ Aను కేవలం 136 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్య పరిచింది. దీనితో 137 పరుగుల…
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన భారత్ ఏ జట్టును ప్రకటించారు. టీ20 స్టార్ జితేశ్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నమన్ ధిర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్స్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైశాఖ్, అభిషేక్…
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దాడి అనంతరం పాక్‌కు ప్రతి విషయంలో దెబ్బ కొడుతున్నారు మనోళ్లు. మొన్న ముగిసిన ఆసియా కప్ 2025లో టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భారత మహిళలు జట్టు కూడా నో షేక్ హ్యాండ్ విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో…
IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది.
India vs Pakistan: 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య నేడు (అక్టోబరు 5) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. తమ ప్రపంచకప్ ప్రచారాన్ని శ్రీలంకపై గెలుపుతో ప్రారంభించిన భారత్, మహిళల వన్డేల్లో తమ వరుసగా 12వ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ…
జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన…
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్‌పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో నఖ్వీ స్పందించారు. మోడీపై…
తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.. అతడే తిలక్ వర్మ. ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన తిలక్‌వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్…
టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30) మాయ చేయడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ తడబడినా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో భారత్…
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి…