కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌటైంది. 74.2 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మొమినల్ హక్ (107 నాటౌట్) సెంచరీ చేయగా.. నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20) పరుగులు చేశారు. భారత బౌలరు జస్ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు.
మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌటైన అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలెట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నారు. టీ20 మాదిరి సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ తాను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను స్టాండ్‌లోకి పంపాడు. తర్వాతి ఓవర్లో మరో సిక్స్ బాదాడు. నాలుగో ఓవర్లో బౌండరీ బాదిన హిట్‌మ్యాన్.. అదే ఓవర్లో బోల్డ్ అయ్యాడు. దాంతో ఫాన్స్ నిరాశకు గురయ్యారు.
Also Read: Royal Enfield Recall: ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బైక్స్ వెనక్కి.. కారణం ఏంటంటే?
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 13 బంతుల్లోనే 30 రన్స్ బాదాడు. ఇందులో 6 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ అనంతరం శుభమాన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. ఇంకా ఒక రోజు మాత్రమే ఆట ఉండడడంతో వేగంగా పరుగులు చేయాలని భారత్ చూస్తోంది. భారీ స్కోర్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలని భారత్ ప్లాన్.