బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నారు. వెన్ను గాయం కారణంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ సమాచారం తెలిపింది. సీనియర్ సెలక్షన్ కమిటీ శివమ్ స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా.. ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నారు.
సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లాంటి ఇద్దరు స్టార్ క్రికెట్‌లో జట్టులో ఉన్నారు. వారితో పాటు టి-20 ప్రపంచకప్ విజేత జట్టులో భాగమైన అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ గొప్ప అవకాశం లభించింది. అభిషేక్, సంజూ శాంసన్ ఇద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
Piles: పైల్స్ తో బాధపడుతున్నారా..? ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి
ఈ సంవత్సరం ప్రారంభంలో మయాంక్ ఐపీఎల్‌లో 150 kmph స్పీడ్ తో నిలకడగా బౌలింగ్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అయితే.. అతని పక్కటెముకల నొప్పితో అతను టోర్నమెంట్ నుండి మధ్యలోనే వైదొలగవలసి వచ్చింది. సాధారణంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. 22 ఏళ్ల మయాంక్ తన ప్రత్యేక నైపుణ్యాల కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
టీ20 సిరీస్ కోసం జట్లు-
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ .
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ అమోన్, తౌహీద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిటన్ దాస్, జాకీర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మద్, తస్రీకిన్ అహ్మద్, తస్రికిన్ ఇస్లామ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.