భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
RIP GOUTAM GAMBHIR: టీమిండియా ఐదో టెస్టులో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను ఐదో టెస్ట్ నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “RIP Gautam Gambhir” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి వేలాదిగా ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో…
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.
సిడ్నీ వేదికగా రేపటి (జనవరి 2) నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 907 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సంచలన ప్రదర్శనకు గాను ఈ రికార్డు బుమ్రా ఖాతాలో చేరింది. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 30 వికెట్స్ పడగొట్టాడు. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత మాజీ స్పిన్నర్…
కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్‌గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు.…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు.
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీరు ‘భారత్’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏం చేశారన్నది ముఖ్యం.