ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ రికార్డు. అంతకుముందు ఈ రికార్డు 302గా ఉంది. 2024లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక మహిళలు 302 పరుగులను ఛేదించారు. టాప్ రికార్డ్ ఛేజింగ్‌లో ఆస్ట్రేలియావే నాలుగు ఉండడం విశేషం. 2012లో 289 రన్స్, 2023లో 283 పరుగులు, 2025లో 282 రన్స్ ఛేదించింది. ఈ రికార్డులు చూస్తే ఆసీస్ ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో ఇట్టే అర్ధమవుతోంది. అత్యధిక వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన జట్టు కూడా ఆస్ట్రేలియానే. ఇక ఇది ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఛేజ్ కూడా. 2022 ప్రపంచకప్‌లో ఆక్లాండ్‌లో భారతదేశంపై ఆస్ట్రేలియా 278 పరుగులను ఛేదించింది.
Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ముప్పు?
నయా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా.. ఓటమి చూడని జట్టుగా 2025 వరల్డ్‌కప్‌లో కొనసాగుతుంది. టీమిండియాపై విజయంతో ఆసీస్ టోర్నీలో తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 4 పాయింట్స్ సాధించి.. ప్రస్తుతానికి మూడో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే వరుస ఓటముల కారణంగా టీమిండియా నెట్ రన్‌రేట్ గణనీయంగా పడిపోయింది. దీంతో తదుపరి మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది.