వెస్టిండీస్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ముగిసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. ఐపీఎల్ 2025 తర్వాత ఇద్దరూ మైదానంలోకి దిగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీలు సన్నదమవుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఫిట్‌నెస్‌లో కింగ్ పర్‌పెక్ట్ అని ప్రశంసించాడు.
వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేస్తాడని హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఫిట్‌నెస్‌లో కింగ్ మిస్టర్ పర్‌పెక్ట్. ప్రస్తుత ఆటగాళ్లలో అందరి కంటే విరాట్ ఫిట్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కోహ్లీ ఫిటెస్ట్ ప్లేయర్, ఇందులో సందేహమే లేదు. విరాట్ ఆట కోసం నేను ఎదురుచూస్తున్నా. అతడు మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కోహ్లీ భారీగా పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ రాణిస్తాడని నమ్మకంగా ఉన్నా. వన్డే సిరీస్‌లోని 3 మ్యాచ్‌లలో కనీసం 2 సెంచరీలు చేస్తాడని భావిస్తున్నా. రోహిత్ శర్మ కూడా మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. ఇద్దరి ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
Also Read: Gautam Gambhir:: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ.. గంభీర్ రియాక్షన్ ఇదే!
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 వన్డేలు ఆడిన విరాట్.. 51.03 సగటుతో 1327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో కూడా విరాట్ ఆకటుకున్నాడు. ఈ నేపథ్యంతోనే విరాట్ చెలరేగుతాడని హర్భజన్ నమ్మకంగా ఉన్నాడు. మంగళవారం కింగ్ లండన్ నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నాడు. భారత జట్టుతో కలిసి ఈరోజు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం కోహ్లీ లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.