IND vs AUS: బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లోని రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ పింక్ బాల్ టెస్టులో భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. దీంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 19 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం లభించింది. దాంతో వికెట్ కోల్పోకుండా భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని…
Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చివరివరకు వచ్చిన తర్వాత ఓ అభిమానిని చూసిన మార్నస్ లబుషేన్ అకస్మాత్తుగా క్రీజు నుంచి వైదొలిగాడు. మార్నస్ దూరంగా…
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి వచ్చానని మూడు ఇన్నింగ్స్‌ల్లోనే తన ప్రదర్శనతో చూపించాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 120కి పైగా పరుగులు చేశాడు. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా నితీష్ రెడ్డి అత్యధిక పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తన ఇన్నింగ్స్ సమయంలో నితీష్…
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే క్రికెట్ ఆస్ట్రేలియాపై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండుసార్లు లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో.. భారత ఆటగాళ్లు, అంపైర్లు అసౌకర్యానికి గురయ్యారు. మ్యాచ్ మధ్యలో పవర్ కట్ కారణంగా రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది.
IND vs AUS Day 1: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు ఆగస్టు 6 అడిలైట్ వేదికగా రెండో టెస్ట్ మొదలైంది. ఈ టెస్టు డే అండ్ నైట్ కావడంతో పింక్ బాల్ తో మ్యాచ్ ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఆర్ వికెట్లు తీయగా టీమిండియా తక్కువ పరుగులకే కుప్పకూలింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 180…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్స్ పడగొట్టడంతో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) పరుగులు చేశారు. స్టార్క్ ‘ఆరే’యగా..…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. డే/నైట్ టెస్ట్ మొదటిరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ కాగా.. విరాట్ కోహ్లీ (7) పరుగులే చేసి…
తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారని, తాను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం అని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఒక రోజు నాన్న ఏడవడం కూడా చూశానని చెప్పాడు. ఇప్పుడు ఓ కుమారుడిగా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా అని, తన తొలి జెర్సీని ఆయనకే ఇచ్చానని నితీశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మరికొద్దిసేపట్లో అడిలైడ్ వేదికగా పింక్ బాల్ (డే/నైట్) టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు మార్పులతో బరిలోకి దిగుటున్నట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. తాను, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపాడు. పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లు పెవిలియన్‌కే పరిమితం అయ్యారు. డే/నైట్ టెస్టులో ఓపెనర్‌గా లోకేష్ రాహుల్ఆడుతున్నడని, తాను…
ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసి అద్భుత విజయం సాదించిన టీమిండియా.. ఇక రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే అడిలైడ్‌లో గత పర్యటన అనుభవం భారత జట్టుకు హెచ్చరికలు పంపుతోంది. అడిలైడ్ మైదానంలో గత పర్యటనలో ఆడిన టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన…