IND vs AUS Day 1: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు ఆగస్టు 6 అడిలైట్ వేదికగా రెండో టెస్ట్ మొదలైంది. ఈ టెస్టు డే అండ్ నైట్ కావడంతో పింక్ బాల్ తో మ్యాచ్ ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఆర్ వికెట్లు తీయగా టీమిండియా తక్కువ పరుగులకే కుప్పకూలింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ మొదటి బంతికి యశస్వి జైస్వాల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యుగా వెనుతిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపు కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ లు స్కోర్ బోర్డ్ పై నెమ్మదిగా పరుగులు రాబట్టారు. ఇందులో భాగంగా 69 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ 37 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. వెంటనే క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఏడు పరుగులు మాత్రమే సాధించి మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ కూడా 31 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.
ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కేవలం 3 పరుగులకే నిరాశపరిచాడు. దింతో కేవలం 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత హైదరాబాద్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 42 పరుగులు సాధించి టాప్స్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు రిషబ్ పంత్ 21, రవిచంద్రన్ అశ్విన్ 22 పరుగులు చేయడంతో టీమిండియా గౌరవమైన స్కోరును అందుకుంది. ఆస్ట్రేలియా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, బొలాండ్ చెరో 2 వికెట్లు తీశారు.
Also Read: Bajaj Chetak: స్టైలిష్ లుక్‌తో.. తక్కువ ధరతో త్వరలో మార్కెట్లోకి
ఇక మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మొదట కాస్త ఆచితూచి ఆడింది. దీంతో స్కోర్ రోడ్డుపై పరుగులు రావడం కష్టంగా మారింది. ఓపెనర్ ఉస్మాన్ క్వాజా బుమ్రా బౌలింగ్ లో రోహిత్ శర్మ కు క్యాచ్ ఇచ్చి 13 పరుగుల చేసి వెలియన్ చేరాడు. ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఆడింది. ఈనెబద్దంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ మేక్స్వీనీ 38 పరుగులు, లబ్సింగే 20 పరుగులతో అజయంగా క్రీజ్ లో ఉన్నారు.